
నాచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు కలిసి చేసిన వి సినిమా రీసెంట్ గా డిజిటల్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అమేజాన్ ప్రైమ్ లో సెప్టెంబర్ 5న వరల్డ్ వైడ్ రిలీజ్ అయిన వి సినిమా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ తో ఓ సంచలనం సృష్టించింది. ఇక ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కూడా నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చిపెట్టినట్టు తెలుస్తుంది. నాని వి సినిమాను జెమిని టివి వారు 8 కోట్లకు కొనేసినట్టు తెలుస్తుంది.
డిజిటల్ రైట్స్ 33 కోట్లతో అదరగొట్టిన నాని వి సినిమా శాటిలైట్ రైట్స్ లో కూడా సత్తా చాటింది. సినిమా టాక్ ఎలా ఉన్నా నిర్మాత దిల్ రాజుకి డిజిటల్, శాటిలైట్ రైట్స్ తో కూడా సేఫ్ అయ్యాడు. వి సినిమాలో నాని, సుధీర్ బాబులకు జంటగా అదితి రావు, నివేదా థామస్ నటించారు.