ప్రభాస్ 60 రోజుల కాల్ షీట్..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ ఎనౌన్స్ మెంట్ తో అంచనాలు పెంచాడు. ఓం రౌత్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్ కనిపించనున్నాడు. ఈ మూవీలో రావణుడిగా సైఫ్ ఆలి ఖాన్ నటిస్తున్నారు. 500 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా కేవలం 120 రోజుల్లో పూర్తి చేసేలా షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారట. అందులో ప్రభాస్ 60 రోజులు షూటింగ్ పాల్గొంటాడని తెలుస్తుంది. కేవలం 60 రోజుల కాల్ షీట్ తో ఈ సినిమాకు 100 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడు ప్రభాస్.  

ఆదిపురుష్ సినిమాను దాదాపు స్టూడియోలో షూట్ చేయాలని చూస్తున్నారు డైరక్టర్ ఓం రౌత్. గ్రాఫిక్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ సినిమా 80 శాతం వరకు స్టూడియోలోనే చేస్తారట. 20 శాతం షూటింగ్ మాత్రం ఓపెన్ లోకేషన్స్ లో చేస్తారని తెలుస్తుంది. ఈ సినిమాతో పాటుగా ప్రభాస్ తన 21వ సినిమా కూడా సెట్స్ మీదకు తీసుకెళ్ళనున్నాడు.