మెగాస్టార్ తో ఛాన్స్ పట్టేసిందా..?

ఆచార్య తర్వాత మెగస్టార్ చిరంజీవి వరుసగా మరో మూడు సినిమాలు లైన్ లో పెట్టారు. అందులో తమిళ సూపర్ హిట్ మూవీ వేదాళం కూడా ఉంది. ఈ సినిమా రీమేక్ బాధ్యతలను మెహెర్ రమేష్ కు అప్పచెప్పినట్టు తెలిసిందే. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న ఈ సినిమాకు కాస్ట్ అండ్ క్రూ సెలెక్ట్ చేసే పనిలో ఉన్నారట. తెలుస్తున్న సమాచారం ప్రకారం వేదాళం తెలుగు రీమేక్ లో మెగాస్టార్ తో సాయి పల్లవి ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది. 

ఫిదా సినిమాతో తెలుగులో క్రేజ్ తెచ్చుకున్న సాయి పల్లవి వరుస సినిమాలతో బిజీ హీరోయిన్ అయ్యింది. ప్రస్తుతం తెలుగులో నాగ చైతన్యతో లవ్ స్టోరీ, రానాతో విరాటపర్వం సినిమాలు చేస్తున్న సాయి పల్లవి చిరు సినిమాలో కూడా అవకాశం దక్కించుకుందని తెలుస్తుంది. ఈ సినిమాలో సాయి పల్లవి చిరంజీవి సిస్టర్ రోల్ చేస్తుందని అంటున్నారు. ఈ సినిమాపై మరిన్ని డీటైల్స్ త్వరలో రానున్నాయి.