మహేష్ కూడా షూటింగ్ స్టార్ట్ చేశాడు..!

కరోనా లాక్ డౌన్ టైం లో ఆరు నెలలు ఇంటికే పరిమితమైన స్టార్స్ ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. కేంద్ర సినిమా షూటింగ్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా జాగ్రత్తలు తీసుకుని సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఇప్పటికే స్టార్స్ తమ సినిమాల షూటింగ్స్ మొదలు పెట్టగా వారి దారిలోనే మహేష్ కూడా షూటింగ్ లో పాల్గొన్నాడు. అయితే మహేష్ పాల్గొన్నది సినిమా షూటింగ్ లో కాదు యాడ్ షూటింగ్ లో అని తెలుస్తుంది. అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ యాడ్ షూటింగ్ జరుగుతుంది.

ఈ షూటింగ్ కోసం మహేష్ రెండు రోజులు కేటాయించినట్టు తెలుస్తుంది. సెట్ లో అందరు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. డైరక్టర్ తో మహేష్ చెయిర్ లో కూర్చుని మాట్లాడుతున్న పిక్ ఒకటి సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. ఈ ఇయర్ మొదట్లోనే సరిలేరు నీకెవ్వరు సినిమాతో హిట్ అందుకున్న మహేష్ పరశురాం డైరక్షన్ లో సర్కారు వారి పాట సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. ఈ సినిమాలో మహేష్ డ్యుయల్ రోల్ లో కనిపిస్తాడని టాక్.