రష్మిక ఖాతాలో మరో క్రేజీ మూవీ

ఛలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కన్నడ భామ రష్మిక మందన్న తెలుగులో ఓ రేంజ్ క్రేజ్ తెచ్చుకుంది. మొదటిపెట్టింది చిన్న సినిమాతోనే అయినా ప్రస్తుతం అమ్మడి కెరియర్ పీక్స్ లో ఉంది. ఈ ఇయర్ మొదట్లోనే సూపర్ స్టార్ మహేష్ సరసన నటించిన అమ్మడు అల్లు అర్జున్ పుష్ప సినిమాలో ఛాన్స్ అందుకుంది. ఇదే కాదు మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలో కూడా రష్మిక నటిస్తుందని తెలుస్తుంది. అదేంటి ఆచార్యలో చిరు సరసన కాజల్ నటిస్తుంది కదా అంటే సినిమాలో చిరుతో పాటు చరణ్ కూడా నటిస్తున్నాడని తెలిసిందే. చరణ్ కు అమ్మడు హీరోయిన్ గా నటిస్తునని అంటున్నారు.

ఆచార్యలో రాం చరణ్ 40 నిమిషాల పాత్ర చేస్తున్నాడని తెలుస్తుంది. అందులో రష్మిక ఒక 15 నుండి 20 నిమిషాల పాత్రలో కనిపిస్తుందట. ఈ సినిమాలో నటించేందుకు రష్మిక భారీ డిమాండ్ చేసిందట.. అయినా సరే ఉన్న కొద్దిసేపు స్టార్ హీరోయిన్ కావాల్సిందే అని రష్మిక అడిగినంత ఇచ్చి ఆమెను సెలెక్ట్ చేశారని తెలుస్తుంది. వరుస క్రేజీ సినిమాలతో రష్మిక తెలుగులో అదరగొడుతుంది.