భీష్మ డైరక్టర్ కు కాస్ట్ లీ గిఫ్ట్

యువ హీరో నితిన్ క్రేజీ డైరక్టర్ వెంకీ కుడుముల కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ భీష్మ. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా నితిన్ డైరక్టర్ వెంకీకి కాస్ట్ లీ కారు గిఫ్ట్ గా ఇచ్చాడు. శ్రీనివాస కళ్యాణం సినిమా తర్వాత కెరియర్ లో మరోసారి వెనకపడ్డ నితిన్ కు భీష్మ రూపంలో హిట్ ఇచ్చాడు డైరక్టర్ వెంకీ కుడుముల.     

సినిమా హిట్ ఇచ్చినందుకు గాను డైరక్టర్ కు నితిన్ రేంజ్ రోవర్ కార్ కానుకగా ఇచ్చాడు. ఛలో సినిమాతో హిట్ అందుకున్న వెంకీ కుడుముల ఆ సినిమా హీరో నుండి కూడా కారు గిఫ్ట్ గా పొందాడు. ఇప్పుడు రెండో సినిమా హిట్టు కొట్టి మరో కారు గిఫ్ట్ గా సంపాదించాడు. నితిన్ ఇచ్చిన ఈ గిఫ్ట్ కు వెంకీ సూపర్ హ్యాపీగా ఉన్నాడు. తనకు నితిన్ కారు ఇచ్చిన విషయాన్ని వెంకీ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.