
బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమా చేస్తున్న అఖిల్ ఈ సినిమా తర్వాత తన ఐదవ సినిమా ఎవరితో చేస్తాడన్న కన్ ఫ్యూజన్ కు తెర పడింది. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో అఖిల్ 5వ సినిమా ఫిక్స్ అయ్యింది. ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అనీల్ సుంకర నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబందించిన ఎనౌన్స్ మెంట్ సెప్టెంబర్ 9 ఉదయం 9 గంటల 9 నిమిషాల 9 సెకన్లకు వస్తుందట.
క్రేజీ కాంబోగా రాబోతున్న ఈ సినిమా గురించి ఎలాంటి ప్రకటన రాబోతుంది అన్నది అక్కినేని ఫ్యాన్స్ లో ఆసక్తి పెరిగింది. అఖిల్, హలో, మిస్టర్ మజ్ను సినిమాలతో ఫ్లాప్ అందుకున్న అఖిల్ బ్యాచ్ లర్ సినిమాతో ఎలాగైనా హిట్టు కొట్టాలని ఫిక్స్ అయ్యాడు. ఈ సినిమాలో పూజా హెగ్దే గ్లామర్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచేలా ఉంది. రేపు రానున్న ఆ ఎనౌన్స్ మెంట్ ఎలా ఉండబోతుందో చూడాలి.