అఖిల్ తో వంశీ పైడిపల్లి..!

మహర్షి సినిమా తర్వాత మహేష్ తోనే మరో సినిమా ఉంటుందని ఆశపడ్డ డైరక్టర్ వంశీ పైడిపల్లికి అనుకోకుండా మహేష్ సినిమా ఆఫర్ చేజారింది. ఆ తర్వాత చరణ్ సినిమా తగులుతుందని భావించాడు కానీ అది కూడా మిస్సయింది. మహేష్, చరణ్ ఇద్దరు హ్యాండ్ ఇవ్వడంతో అక్కినేని హీరోతో సినిమాకు ఫిక్స్ అయ్యాడట వంశీ పైడిపల్లి. నాగార్జునతో ఆల్రెడీ ఊపిరి సినిమా చేసిన వంశీ పైడిపల్లి ఇప్పుడు అఖిల్ తో సినిమాకు రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. 

అఖిల్ కోసం వంశీ ఓ లైన్ రెడీ చేశాడట. అది అఖిల్ ఓకే అంటే ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తాడట. త్వరలోనే ఈ కాంబోకి సంబందించిన క్రేజీ అప్డేట్ వస్తుందని అంటున్నారు. అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత అఖిల్ వంశీ పైడిపల్లి మూవీ చేస్తాడని అంటున్నారు. ఓ పక్క సురేందర్ రెడ్డి కూడా అఖిల్ తో సినిమాకు రెడీ అంటున్నాడు. మరి వంశీ, సురేందర్ రెడ్డి ఈ ఇద్దరిలో అఖిల్ నెక్స్ట్ సినిమాకు ఎవరు ఫైనల్ అవుతారో చూడాలి.