రంగ్ దే కోసం ఫ్యాన్సీ ఆఫర్స్..!

నితిన్, కీర్తి సురేష్ జంటగా వెంకీ అట్లూరి డైరక్షన్ లో వస్తున్న సినిమా రంగ్ దే. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. నితిన్ మ్యారేజ్ సందర్భంగా సినిమా నుండి ఓ క్రేజీ టీజర్ రిలీజ్ చేయగా సినిమాపై అంచనాలు పెంచింది. త్వరలో యూరప్ షెడ్యూల్ కు రెడీ అవుతున్న ఈ సినిమా ఓటిటి రిలీజ్ కోసం ఫ్యాన్సీ ఆఫర్స్ వస్తున్నాయట. నితిన్ రంగ్ దే కోసం అమేజాన్ ప్రైమ్ తో పాటుగా జీ 5 కూడా గట్టి పోటీ ఇస్తుందట. ఇప్పటికే సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ సినిమా డిజిటల్, శాటిలైట్ రైట్స్ ను భారీ మొత్తంలో జీ 5 దక్కించుకుందని తెలుస్తుంది. 

ఇక ఇప్పుడు నితిన్ రంగ్ దే సినిమాకు కూడా అలాంటి క్రేజీ డీల్ సెట్ చేస్తున్నారట.అమేజాన్ ప్రైమ్ కు పోటీ ఇచ్చేనందుకు జీ 5 ప్రయత్నిస్తుంది. అందుకే అమేజాన్ ప్రైమ్ కన్నా ఎక్కువ ప్రైస్ తో సినిమాలను కొనే ప్లాన్ చేస్తున్నారు. నితిన్ రంగ్ దే సినిమా ఎవరికీ దక్కుతుంది. డిజిటల్, శాటిలైట్ రైట్స్ తో నితిన్ రంగ్ దే ఎంత టేబుల్ బిజినెస్ జరుగుతుందో తెలియాల్సి ఉంది.