
నాచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ వి. ఇంద్రగంటి మోహనకృష్ణ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో అదితి రావు హైదరి, నివేదా థామస్ హీరోయిన్స్ గా నటించారు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 5న అమేజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయ్యింది. ఇక ఈ సినిమా చూశాక నిర్మాత దిల్ రాజు ఓ భారీ ఫ్లాప్ నుండి తప్పించుకున్నాడని అంటున్నారు ఆడియెన్స్. ఇదే సినిమా థియేటర్ రిలీజ్ అయ్యుంటే దిల్ రాజుకి తప్పకుండా భారీ లాసులు తప్పవని.. తెలివిగా ఓటిటి రిలీజ్ చేసి మంచిపని చేశాడని అంటున్నారు.
నాని విలన్ గా ఇరగదీస్తాడని అనుకుంటే రొటీన్ కథ కోసం విలన్ గా చేసి రిస్క్ లో పడ్డాడని రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాలో సుధీర్ బాబు హార్డ్ వర్కింగ్ కు మంచి మార్కులు పడ్డాయి. అంతేకాదు సినిమా ఓటిటి రిలీజై రెండు రోజులు అవుతున్నా ఇంతకవరకు ఒక్క స్టార్ హీరో కూడా నాని వి గురించి ఒక్క ట్వీట్ కూడా వేయకపోవడం షాకింగ్ గా ఉంది. రాజమౌళి తన ఫ్యామిలీతో కలిసి ఇంట్లో ఈ సినిమా చూసినా సైలెంట్ గా ఉన్నాడు అంటే ఆయనకు సినిమా నచ్చలేదేమో అని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి దిల్ రాజు కరోనా వల్ల థియేటర్లు మూతపడటం వి సినిమాను ఓటిటి రిలీజ్ చేయడం అతన్ని పెద్ద లాస్ నుండి బయటపడేలా చేశాయని అంటున్నారు. నాని వి అమేజాన్ ప్రైమ్ 33 కోట్లతో డిజిటల్ రైట్స్ సొంతం చేసుకుంది.