
ఎన్నాళ్ళనుండో ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 4 అంగరంగ వైభవంగా మొదలైంది. ఈ సీజన్ కు కూడా హోస్ట్ గా కింగ్ నాగార్జున చేస్తున్నారు. ఎప్పటిలానే 16 మంది కంటెస్టెంట్స్ తో హౌజ్ కళకళకాడుతుంది. ఈసారి బిగ్ బాస్ బిగ్ హౌజ్ కూడా చాలా బాగుంది. విశాలమైన గదులు.. చాలా కలర్ ఫుల్ గా ఉంది. బిగ్ బాస్ సీజన్ 4 ఆరంభం అదిరిపోయింది. హోస్ట్ నాగార్జున ఎప్పటిలానే తన ఎనర్జీతో ఆడియెన్స్ ను మెప్పించారు.
ఇక బిగ్ బాస్ సీజన్ 4 ఫైనల్ కంటెస్టెంట్ లిస్ట్ ఎవరనేది చూస్తే మోనాల్ గజ్జర్ హీరోయిన్ గా తెలుగులో ఐదారు సినిమాలు చేసింది. ఈమధ్య కెరియర్ లో బ్యాక్ అవడంతో బిగ్ బాస్ ద్వారా తెలుగు ఆడియెన్స్ కు దగ్గరవ్వాలని చూస్తుంది. ఇక సెకండ్ కంటెస్టెంట్ గా డైరక్టర్ సూర్య కిరణ్ వచ్చారు. సత్యం, రాజు భాయ్ సినిమాలతో క్రేజ్ తెచ్చుకున్న సూర్య కిరణ్ బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా సర్ ప్రయిజ్ చేశారు. ఇక థర్డ్ కంటెస్టెంట్ గా స్టార్ యాంకర్ లాస్య వచ్చారు. పెళ్ళి తర్వాత బుల్లితెరకు దూరమైనా లాస్య మళ్ళీ తన ఆడియెన్స్ కు దగ్గరవ్వాలని ఉద్దేశంతో బిగ్ బాస్ కు వచ్చినట్టు చెప్పారు. 4వ కంటెస్టెంట్ గా యువ హీరో అభిజిత్ వచ్చారు. లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్ సినిమా హీరోగా మెప్పించిన అభిజిత్ ఆ తర్వాత పెళ్లిగోల వెబ్ సీరీస్ లో చేశాడు. ఇక నాల్గవ కంటెస్టెంట్ గా సుజాత ఎంట్రీ ఇచ్చారు. తెలంగాణా యాసతో బుల్లితెర మీద సందడి చేస్తున్న శృతి అలియాస్ సుజాత నాగార్జునని బిట్టు అంటూ అలరించారు.
ఇక 5వ కంటెస్టెంట్ గా దిల్ సే మెహబూబ్ వచ్చారు. యూట్యూబ్ స్టార్ గా మెహబూబ్ క్రేజ్ తెచ్చుకోగా ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చారు. ఇక 6వ కంటెస్టెంట్ గా న్యూస్ రీడర్ దేవి నాగవల్లి వచ్చారు. బిగ్ బాస్ టైటిల్ గెలవడమే తన లక్ష్యమని ఇక్కడ ఇచ్చే ప్రైస్ మనీ కోసమే తాను బిగ్ బాస్ హౌజ్ కు వచ్చానని చెప్పారు దేవి. ఇక 7వ కంటెస్టెంట్ గా తమడా మీడియాలో వచ్చే వైరల్లీ వీడియోస్ తో ఫేమస్ అయిన దేత్తడి హారిక ఎంట్రీ ఇచ్చారు. క్రేజీ పర్ఫార్మెన్స్ తో అమ్మడు ఆకట్టుకుంది. హౌజ్ లో తను తనలానే ఉంటానని చెప్పింది హారిక.
ఇక 9వ కంటెస్టెంట్ గా సయ్యద్ సోహెల్, 10వ కంటెస్టెంట్ గా అరియానా గ్లోరీ వచ్చారు. నాగార్జున వీరిద్దరిని సెపరేట్ హౌజ్ లో ఉంచి అప్పుడే టాస్క్ మొదలుపెట్టాడు. ఇక 11, 12, 13 కంటెస్టెంట్స్ గా అమ్మా రాజశేఖర్, కరాటే కల్యాణి, నోయెల్ వచ్చారు. ఇక 14వ కంటెస్టెంట్ గా వచ్చారు మోడల్ కమ్ వెబ్ సీరీస్ హీరోయిన్ దివి. తాను పాపులర్ అయ్యేందుకు బిగ్ బాస్ హౌజ్ కు వచ్చినట్టు చెప్పారు. 15వ హౌజ్ మేట్ గా సీరియల్ యాక్టర్ అఖిల్ సార్దిక్ రాగా 16వ క్రేజీ కంటెస్టెంట్ గా మై విలేజ్ షో గంగవ్వ షాకింగ్ ఎంట్రీ ఇచ్చారు. తాను ఇల్లు కట్టుకునేందుకు బిగ్ బాస్ హౌజ్ కు వచ్చానని తన జీవితంలో పడిన కష్టాల గురించి చెప్పారు గంగవ్వ.
మొత్తానికి 16 మంది క్రేజీ కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ సీజన్ 4 మొదలైంది. చూస్తుంటే మునుపటి సీజన్ కన్నా ఈ సీజన్ మరింత ఎంటర్టైన్ చేసేలా ఉంది. కొత్త టాస్కులు.. సరికొత్త కాన్సెప్ట్ లతో బిగ్ బాస్ హంగామా చేయబోతుంది. ఆల్రెడీ హౌజ్ లో ఉన్న 16 మందికి బాక్సులు ఇచ్చి ఆల్రెడీ ఇద్దరిద్దరుగా కనెక్షన్ స్టార్ట్ చేశాడు బిగ్ బాస్.. మరి ఇక ఆట ఎలా సాగిస్తారో చూడాలి.