సమంత కొత్త బిజినెస్..!

సౌత్ స్టార్ హీరోయిన్ గానే కాదు అక్కినేని కోడలిగా సమంత సక్సెస్ ఫుల్ ఫామ్ లో ఉంది. సెలెక్టెడ్ సినిమాలు చేస్తూ వస్తున్న ఈ అమ్మడు తెలుగులో తన నెక్స్ట్ సినిమా ఏంటన్నది రివీల్ చేయలేదు. ప్రస్తుతానికి తమిళంలో ఒక సినిమా చేస్తున్న అమ్మడు ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ సీక్వల్ లో కూడా విలన్ రోల్ లో నటించింది. ఈమధ్యనే సమంత ఓ సీక్రెట్ ప్రాజెక్ట్ చేస్తున్నా అని ఫ్యాన్స్ తో జరిపిన చిట్ చాట్ లో వెల్లడించింది. అదేదో సినిమా ప్రొడ్యూస్ చేస్తుంది అదే ఆమె చేసే సీక్రెట్ ప్రాజెక్ట్ అని అన్నారు కానీ లేటెస్ట్ గా సమంత చేసిన సీక్రెట్ ప్రాజెక్ట్ ఏంటన్నది రివీల్ చేసింది. 

సమంత కొత్తగా బట్టల వ్యాపారంలోకి దిగింది సాకి అని కొత్త బ్రాండ్ ను ఇంట్రడ్యూస్ చేసింది. సమంతలో మొదటి రెండు అక్షరాలూ అక్కినేని లో మొదటి రెండు అక్షరాలూ తీసుకుని సాకి అని పెట్టింది. దీనికి సంబందించిన బిగ్ అప్డేట్ తన ట్విట్టర్ లో షేర్ చేసింది సమంత. హీరోయిన్ గా చేసినంత కాలం చేసి ఆ తర్వాత బిజినెస్ లోనే దూసుకెళ్లాలని చూస్తుంది సమంత. అందుకు సాకితో మొదటి అడుగు పడ్డది. త్వరలోనే ఇవి మార్కెట్ లోకి తీసుకు రావాలని చూస్తున్నారు.