
నాని వి ఓటిటి రిలీజ్ కొన్ని చిన్న సినిమాలకు ప్రోత్సాహాన్ని ఇచ్చింది. డిజిటల్ రిలీజ్ పై కూడా మేకర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇదిలాఉంటే లేటెస్ట్ గా సుహాస్, చాందిని చౌదరి జంటగా నటించిన కలర్ ఫోటో సినిమాను ఓటిటి రిలీజ్ కు సిద్ధమైందని తెలుస్తుంది. కలర్ ఫోటో సినిమాకు ఆహా మంచి ప్రైస్ ఆఫర్ చేశారట. ఇప్పట్లో థియేటర్ రిలీజ్ అంటే కష్టమని భావించి ఆహా ఓటిటి రిలీజ్ కు కలర్ ఫోటో టీమ్ ఓకే చెప్పిందట.
సినిమాను ఎంతకు కొన్నారన్నది తెలియలేదు కానీ నవంబర్ 14 దీపావళి సందర్భంగా ఈ సినిమా ఓటిటి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. చాయ్ బిస్కెట్ యూట్యూబ్ ఛానెల్ తో డైరక్టర్ గా సందీప్, యాక్టర్ గా సుహాస్ మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. ఇక హృదయ కాలేయం, కొబ్బరిమట్ట సినిమాలని డైరెక్ట్ చేసిన సాయి రాజేష్ ఈ సినిమాను నిర్మించారని తెలుస్తుంది. రీసెంట్ గా రిలీజైన కలర్ ఫోటో టీజర్ ప్రేక్షకులను మెప్పించింది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.