అతనికి ప్రభాస్ విలువైన బహుమతి

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన ఫిట్ నెస్ ట్రైనర్ కు కాస్ట్ లీ గిఫ్ట్ ఇచ్చాడు. తన దగ్గర కొన్నాళ్ళుగా పనిచేస్తున్న లక్ష్మణ్ రెడ్డికి ప్రభాస్ రేంజ్ రోవర్ కారు గిఫ్ట్ గా ఇచ్చాడు. తనకు నచ్చితే అంతే ఎలాంటిది ఇవ్వడానికైనా ప్రభాస్ వెనుకాడడు తన ఫిట్ నెస్ ట్రైనర్ కు కూడా విలువైన గిఫ్ట్ ఇచ్చి సర్ ప్రయిజ్ చేశాడు ప్రభాస్. బాహుబలి ఇచ్చిన గిఫ్ట్ తో ఆ ఫిట్ నెస్ ట్రైలర్ ఆనందానికి అవధుల్లేవని చెప్పొచ్చు. 

అతనికే కాదు తన దగ్గర పనిచేస్తున్న వారికి ఎవరికి ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా సరే నేనున్నా అంటూ ప్రభాస్ సహాయం చేస్తాడట. అందుకే అతన్ని డార్లింగ్ అని అందరు అంటారు. ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ తో ఒక సినిమా.. ఓం రౌత్ డైరక్షన్ లో ఆదిపురుష్ సినిమా చేస్తున్నాడు. ఈ ఈ మూడు సినిమాలు భారీ బడ్జెట్ తో మరోసారి నేషనల్ వైడ్ గా ప్రభాస్ సత్తా చాటేలా ఉన్నాయి.