
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని డైరక్షన్ లో సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ రోల్ లో కనిపించనున్నారు. ఈ మూవీ తర్వాత రమేష్ వర్మ డైరక్షన్ లో రవితేజ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాకు కిలాడి టైటిల్ పరిశీలనలో ఉంది. ఆల్రెడీ రమేష్ వర్మ డైరక్షన్ లో రవితేజ వీర సినిమా చేశాడు కానీ ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఇక లేటెస్ట్ గా మరోసారి ఈ కాంబోలో సినిమా ఫిక్స్ చేసుకున్నారు.
ఈ సినిమాలో మాస్ రాజా డ్యూయల్ రోల్ లో నటిస్తాడని తెలుస్తుంది. అంతేకాదు సినిమాలో మరో యువ హీరో కూడా నటిస్తాడని అంటున్నారు. శ్రీ విష్ణు, సత్యదేవ్ లాంటి హీరోలు చేసే పాత్ర ఒకటి సినిమాలో ఉంటుందట. నిడివి తక్కువే కానీ ఆ పాత్ర సినిమాకు చాలా ఇంపార్టెంట్ అని అంటున్నారు. రవితేజ చేస్తున్న ఈ క్రేజీ సినిమాలో నటించే ఆ యువ హీరో ఎవరన్నది తెలియాల్సి ఉంది.