చరణ్ నిర్మాణంలో సాయి ధరం తేజ్..?

చిరు రీ ఎంట్రీ సినిమాతో కొణిదెల ప్రొడక్షన్ ను స్థాపించారు రాం చరణ్. చరణ్ నిర్మాతగా చిర్రంజీవి హీరోగా ఖైది నంబర్ 150 సినిమా వచ్చింది. ఆ సినిమా సెన్సేషనల్ హిట్ అందుకోగా తన డ్రీమ్ ప్రాజెక్ట్ సైరా నరసిం హా రెడ్డిని నిర్మించి తండ్రికి కానుకగా ఇచ్చాడు రాం చరణ్. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఆచార్య సినిమాను రాం చారణ్ సమర్పిస్తున్నారు.       

మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిరంజన్ రెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు. నిర్మాతగా సక్సెస్ అందుకున్నా సరే ఈసారి లిమిటెడ్ బడ్జెట్ తో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడత రాం చరణ్. 20 నుండి 25 కోట్ల బడ్జెట్ లో మెగా మెనల్లుడు సాయి ధరం తేజ్ హీరోగా సినిమా ప్లానింగ్ లో ఉన్నాడని తెలుస్తుంది. మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ అంతకుముందు వరుసగా ఆరు ఫ్లాపులు తీసినా లాస్ట్ ఇయర్ చిత్రలహరితో హిట్ ట్రాక్ ఎక్కగా.. ప్రతిరోజూ పండుగే సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. మరి సాయి ధరం తేజ్ తో రాం చరణ్ సినిమా అంటే మెగా ఫ్యాన్స్ కు పండుగే. మరి ఈ కాంబో సినిమా నిజంగా వస్తుందా లేదా అన్నది త్వరలో తెలుస్తుంది.