అందుకే ఆయన్ను 'కింగ్' అన్నారు..!

ఓ పక్క్క కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే స్టార్స్ ఎవరు సినిమా షూటింగ్ చేసేందుకు ముందు రావట్లేదు. కేంద్ర ప్రభుత్వాలు తగిన జాగ్రత్తలతో షూటింగ్ నిర్వహించుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఎవరు స్టార్ట్ చేసినా చేయకపోయినా తను మాత్రం ఆగేది లేదని ముందుకొచ్చాడు కింగ్ నాగార్జున. ఆల్రెడీ బిగ్ బాస్ సీజన్ 4 కోసం కెమెరా ముందుకు వచ్చిన నాగ్ ప్రస్తుతం ఆయన చేస్తున్న వైల్డ్ డాగ్ మూవీ షూటింగ్ లో కూడా పాల్గొన్నారు. దానికి సంబందించిన పిక్స్ తన ట్విట్టర్ లో షేర్ చేశారు నాగార్జున.

ఒకరిద్దరు సాహసం చేస్తేనే వారిని చూసి మరికొందరు షూటింగ్ మొదలుపెడతారు ఆ విషయంలో కింగ్ నాగార్జున జాగ్రత్తలతో కూడిన షూటింగ్ కు సై అనేశారు. ఓ పక్క వైల్డ్ డాగ్ షూటింగ్ మరోపక్క బిగ్ బాస్ 4 రెండిటి షూటింగ్ తో నాగార్జున మళ్ళీ బిజీ అయ్యారని తెలుస్తుంది.