
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ నేషనల్ లెవల్ లో ఏ రేంజ్ లో ఉందో మరోసారి ప్రూవ్ అయ్యింది. గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో పాన్ ఇండియా స్టార్ అని కొట్టగానే ప్రభాస్ ఫోటో రావడం యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ను ఖుషి చేస్తుంది. బాహుబలి సినిమాతో ప్రభాస్ నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్నాడు. బాహుబలి బిగినింగ్, కన్ క్లూజన్ రెండు సినిమాలు బాలీవుడ్ లో సెన్సేషనల్ హిట్ అవడంతో అక్కడ తిరిగులేని క్రేజ్ తెచ్చుకున్నాడు ప్రభాస్.
బాహుబలి తర్వాత వచ్చిన సాహో సినిమా కూడా తెలుగులో నిరాశపరచినా సరే హిందీలో సూపర్ హిట్ అయ్యింది. ఇక రాబోతున్న సినిమాలతో కూడా ప్రభాస్ బాలీవుడ్ లో తన సత్తా చాటనున్నాడని చెప్పొచ్చు. ప్రస్తుతం చేస్తున్న రాధే శ్యామ్ సినిమా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేయగా నాగ్ అశ్విన్ మూవీతో పాటుగా ఆదిపురుష్ కూడా నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్నాయి. మరి ఈ సినిమాల తర్వాత ప్రభాస్ రేంజ్ డబుల్ అవుతుందని చెప్పొచ్చు.