మళ్ళీ బుట్టబొమ్మకే ఛాన్స్..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తో పాటు మరో మూడు సినిమాలకు లైన్ క్లియర్ చేశారు. క్రిష్ తో పిరియాడికల్ మూవీ.. హరీష్ శంకర్ తో ఎంటర్టైనింగ్ విత్ మెసేజ్ మూవీతో వస్తున్న పవర్ స్టార్ ఆ తర్వాత సురేందర్ రెడ్డి డైరక్షన్ లో సినిమా కూడా చేస్తాడని తెలుస్తుంది. హరీష్ శంకర్ డైరక్షన్ లో గబ్బర్ సింగ్ లాంటి సూపర్ హిట్ అందుకున్న పవర్ స్టార్ మరోసారి ఆ కాంబో ఫిక్స్ చేసుకున్నాడు. ఈ సినిమాలో పవర్ స్టార్ సరసన పూజా హెగ్దేని హీరోయిన్ గా సెలెక్ట్ చేశారని తెలుస్తుంది. 

తెలుగులో వరుస స్టార్ అవకాశాలు అందుకుంటున్న పూజా హెగ్దే అల్లు అర్జున్, ఎన్.టి.ఆర్, మహేష్, ప్రభాస్ లతో సినిమలు చేయగా లేటెస్ట్ గా పవర్ స్టార్ తో కూడా జోడీ కట్టబోతుందని తెలుస్తుంది. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే డిజే లో అమ్మడికి ఛాన్స్ ఇచ్చిన హరీష్ శంకర్ లాస్ట్ ఇయర్ వచ్చిన గద్దలకొండ గణేష్ లో కూడా తీసుకున్నాడు. ఇప్పుడు పవన్ సినిమాలో కూడా పూజానే ఫైనల్ చేసినట్టు టాక్. మరి హరీష్ శంకర్ కు పూజా హెగ్దే తప్ప మరే హీరోయిన్ కనిపించడం లేదా లేక కాంబో హిట్టు కాబట్టి ఆమెను రిపీట్ చేస్తున్నాడా అన్నది తెలియాల్సి ఉంది.