
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ డైరక్షన్ లో వస్తున్న క్రేజీ మూవీ ఆచార్య. ఈ సినిమాలో చిరంజీవితో పాటుగా రాం చరణ్ కూడా స్పెషల్ రోల్ లో కనిపిస్తారని తెలుస్తుంది. కొణిదెల ప్రొడక్షన్, మ్యాట్నీ మూవీస్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో చిరు సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన దగ్గర నుండి రాజేష్ అనే రైటర్ ఈ సినిమా కథ తనదే అంటూ హడావిడి చేస్తున్నాడు.
రైటర్స్ అసోసియేషన్ లో తన కథని రిజిస్టర్ చేయించానని ఆ కథతోనే ఆచార్య మూవీ తీస్తున్నారని అన్నారు. అయితే ఈ విషయంపై రైటర్స్ అసోసియేషన్ పెద్దలు జోక్యం చేసుకున్నా గొడవ సర్ధుమనగడం లేదని తెలుస్తుంది. అందుకే తన దగ్గ్ర ఉన్న బౌండెడ్ స్క్రిప్ట్, వన్ లైన్ ఆర్డర్ తో రాజేష్ ఆచార్య సినిమాపై కేసు వేయనున్నాడని తెలుస్తుంది. ఒకవేళ రాజేష్ అలా చేస్తే మాత్రం ఆచార్య రిస్క్ లో పడ్డట్టే. మరి ఈలోగా రాజేష్ కు ఎంతోకొంత ఇచ్చి సైలెంట్ అయ్యేలా చేస్తారా లేక ఆ స్టోరీ మాదే అని ధీమాగా ఉండి విషయం కోర్టులోనే తేల్చుకుంటారా అన్నది తెలియాల్సి ఉంది.