మెరుగుపడుతున్న బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం..!

గాన గంధర్వుడు బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఆయన చికిత్సకు పాజిటివ్ గా స్పందిస్తున్నారని ఎం.జి.ఎం హాస్పిటల్ తాజా బులిటెన్ లో వెల్లడించారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని ఆగష్టు 5న ఎం.జి.ఎం హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు బాల సుబ్రహ్మణ్యం. మొదటి రెండు రోజులు పర్వాలేదు అనిపించినా ఆ తర్వాత లంగ్స్ కు ఏర్పడిన ఇన్ఫెక్షన్ వల్ల పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్స్ అన్నారు. అప్పటినుండి ఎప్పటికప్పుడు బాలు హెల్త్ బులిటెన్ కోసం ఆయన అభిమానులు ఆత్రుతగా ఎదురుచూడసాగారు. 

బాలు తిరిగి క్షేమంగా రావాలని ఎన్నో పూజలు, ప్రాధనలు నిర్వహించారు. వైద్యుల చికిత్సకు అభిమానుల పూజా ఫలితం కూడా తోడై బాల సుబ్రహ్మణ్యం కొద్దిగా కోలుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఆయన ప్రతిదానికి స్పందిస్తున్నారని.. త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని డాక్టర్స్ చెబుతున్నారు.