సమంత సీక్రెట్ ప్రాజెక్ట్ ఏంటి..?

అక్కినేని కోడలు సమంత ఈ లాక్ డౌన్ టైంలో తానో సీక్రెట్ ప్రాజెక్ట్ చేశానంటూ తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ ను ఊరిస్తుంది. పెళ్ళి తర్వాత కూడా కెరియర్ లో ఏమాత్రం ఛాన్సులు తగ్గని సమంత లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ అలరిస్తుంది. ఈ ఇయర్ జాను సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అమ్మడు లాక్ డౌన్ టైం లో టెర్ర్రస్ మీద వ్యవసాయం మొదలుపెట్టింది. అన్ని బంద్ అని తెలిశాక తనకు ముందు గుర్తుకొచ్చింది కూరగాయలని.. అన్ని ఒకేసారి తెచ్చుకున్నా వారం పదిరోజులు ఉంటాయేమో ఆ తర్వాత మళ్ళీ కావాల్సిందే. అందుకే మనమే వాటిని సిద్ధం చేసుకుంటే బెటర్ కదా అని కూరగాయలను పండించడం మొదలుపెట్టింది సమంత.     

ఇక ఈ లాక్ డౌన్ టైంలో తానో సీక్రెట్ ప్రాజెక్ట్ చేశానని అదేంటి అన్నది మాత్రం త్వరలో వెళ్ళడిస్తానని అంటుంది సమంత. అయితే సామ్ చెప్పబోతున్న ఆ సీక్రెట్ ప్రాజెక్ట్ ఏంటి అంటే మళయాళ సినిమా హెలెన్ ను రీమేక్ చేయడమే అంటున్నారు. హెలెన్ రీమేక్ ను సమంత తెలుగులో నిర్మించాలని చూస్తుందట. ఒకేసారి బిగ్ సర్ ప్రైజ్ తో ఈ న్యూస్ వెల్లడిస్తుందని అంటున్నారు. మరి నిజంగానే సమంత చెప్పబోయే సీక్రెట్ ప్రాజెక్ట్ ఇదేనా లేక మరేదైనా పర్సనల్ విషయమా అన్నది తెలియాల్సి ఉంది.