ఆదిపురుష్ లో ఆయనే లంకేష్.. అఫీషియల్ గా చెప్పేశారు..!

ఓం రౌత్ డైరక్షన్ లో టీ సీరీస్ నిర్మిస్తున్న సినిమా ఆదిపురుష్. ప్రభాస్ రాముడు పాత్రలో కనిపించనున్న ఈ సినిమాలో లంకేశ్వరుడి పాత్రలో ఎవరు నటిస్తారా అన్న డిస్కషస్ కొన్నాళ్ళుగా నడిస్తున్నాయి. ఫైనల్ గా ఆదిపురుష్ డైరక్షన్ సినిమాలో రావణుడు ఎవరన్నది కూడా చెప్పేశాడు. ఆదిపురుష్ సినిమాలో రావణుడి పాత్రలో సైఫ్ ఆలి ఖాన్ ను ఫైనల్ చేశారు. చిత్ర దర్శకుడు ఓం రౌత్ సైఫ్ ఆలి ఖాన్ లంకేష్ గా నటిస్తున్నట్టు తన ట్విట్టర్ లో వెల్లడించారు. 

ఆదిపురుష్ లో రాముడికి తగ్గ రావణుడిని సెలక్ట్ చేశారని కొందరు అంటుంటే రావణుడిగా రానాని సెలెక్ట్ చేస్తే బాగుండేది అని మరికొంతమంది ప్రేక్షకులు అంటున్నారు. 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తెలుగు స్టార్ బాలీవుడ్ లో హీరోగా చేస్తూ అక్కడ స్టార్ విలన్ గా నటిస్తాడన్నది ఎప్పుడు ఊహించలేదు. క్రేజీ ప్రాజెక్ట్ గా రాబోతున్న ఈ సినిమాలో సీత పాత్రలో ఎవరిని సెలెక్ట్ చేస్తారు అన్నది మాత్రం ఇంకా రివీల్ చేయలేదు.