తమిళ హీరోయిన్ కు లక్కీ ఛాన్స్..!

టాలీవుడ్ లో స్మాల్ బడ్జెట్ సినిమాలే చేస్తూ సక్సెస్ అందుకున్న హీరో శ్రీ విష్ణు. మంచి పాయింట్ ను తీసుకుని మనసుకి హత్తుకునేలా తీసే అతని సినిమాలు ఆడియెన్స్ ను అలరిస్తాయి. లాస్ట్ ఇయర్ బ్రోచేవారెవరురా సినిమాతో హిట్ అందుకున్న శ్రీ విష్ణు మరో ప్రస్తుతం రెండు క్రేజీ ప్రాజెక్టులతో రాబోతున్నాడు. ఇదిలాఉంటే లేటెస్ట్ గా హరిత్ అనే కొత్త డైరక్టర్ సినిమాకు ఓకే చెప్పాడట శ్రీ విష్ణు. వివేక్ ఆత్రేయ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన హరిత్ డైరక్షన్ లో శ్రీ విష్ణు చేస్తున్న సినిమాలో హీరోయిన్ గా తమిళ అమ్మాయి మేఘా ఆకాష్ ను సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది.   

తెలుగులో నితిన్ సరసన లై, ఛల్ మోహన్ రంగ సినిమాలు చేసిన మేఘా ఆ రెండు సినిమాలు నిరాశపరచడంతో మళ్ళీ ఇటు తిరిగి చూడట్లేదు. అఫ్కోర్స్ హిట్టు పడితేనే ఆమె వెంట దర్శకులు పడతారు ఇది వేరేగా చెప్పాల్సిన పనిలేదు. లేటెస్ట్ గా శ్రీ విష్ణు సినిమాలో మాత్రం హీరోయిన్ గా ఆమెను సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. మరి మేఘాకు ఈ సినిమాతో అయినా లక్ తగిలి తెలుగులో హిట్టు పడుతుందేమో చూడాలి.