బాలకృష్ణ టార్చ్ బేరర్..!

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ సెట్స్ మీద ఉంది. ఈ సినిమాలో బాలయ్య బాబు డ్యుయల్ రోల్ లో అదరగొట్టనున్నారు. ఇక ఈ సినిమా టైటిల్ పై కొన్నాళ్ళుగా రకరకాల పేర్లు వినపడుతున్నాయి. సినిమా టైటిల్ గా మోనార్క్, డేంజర్ అంటూ మొన్నటిదాకా వినపడగా లేటెస్ట్ గా టార్చ్ బేరర్ టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది.  

త్రివిక్రం డైరక్షన్ లో ఎన్.టి.ఆర్ హీరోగా వచ్చిన అరవింద సమేత సినిమాలో టార్చ్ బేరర్ డైలాగ్ చాలా పాపులర్ అయ్యింది. ఇప్పుడు అదే టైటిల్ ను బాలకృష్ణ సినిమాకు పెట్టబోతున్నారని తెలుస్తుంది. సిం హా, లెజెండ్ తర్వాత హ్యాట్రిక్ మూవీగా వస్తున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. BB3 సినిమా టైటిల్ అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ కోసం నందమూరి ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.