
శ్రీదేవి తనయురాలు జాన్వి బాలీవుడ్ లో సత్తా చాటుతుంది. అయితే అమ్మడు సౌత్ సినిమాల మీద కూడా ఆసక్తి చూపిస్తుంది. అమ్మ శ్రీదేవిలానే తను కూడా తెలుగు, తమిళ భాషల్లో నటించాలని అనుకుంటుంది జాన్వి కపూర్. లేటెస్ట్ గా తెలుగులో ఓ క్రేజీ ఛాన్స్ అమ్మడికి దక్కిందని టాక్. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రం ఇద్దరు కలిసి చేస్తున్న సెకండ్ మూవీలో జాన్వికి ఛాన్స్ ఇస్తున్నారని తెలుస్తుంది.
అరవింద సమేత వీర రాఘవ సినిమాతో మంచి ఫలితాన్ని అందుకున్న ఈ కాంబో మరోసారి కలిసి సినిమా చేస్తున్నారు. ఇప్పటికే తారక్ కోసం త్రివిక్రం స్క్రిప్ట్ లాక్ చేయగా కాస్టింగ్ ను ఫైనల్ చేస్తున్నట్టు సమాచారం. ఆర్.ఆర్.ఆర్ తర్వాత తారక్ ఇద్దరు దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కె.జి.ఎఫ్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ సినిమా ఒకటి కాగా త్రివిక్రం సినిమా మరొకటి. ముందు ఎవరిది స్టార్ట్ అవుతుందో తెలియదు కాని ఎన్.టీ.ఆర్ తో ఈసారి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ కథతో వస్తున్నాడట త్రివిక్రం.