తుపాకి-2 తమన్నాకి ఛాన్స్..?

కోలీవుడ్ క్రేజీ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతుంది. స్టార్ డైరక్టర్ మురుగదాస్, ఇళయదళపతి విజయ్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ తుపాకి సీక్వల్ వస్తున్న విషయం తెలిసిందే. ఈ సీక్వల్ లో కూడా కాజల్ హీరోయిన్ గా నటిస్తుందని అన్నారు. కాని లేటెస్ట్ గా ఆ సినిమా నుండి కాజల్ తప్పుకుని తమనా సెలెక్ట్ అయ్యిందని తెలుస్తుంది. తెలుగు, తమిళ భాషల్లో తమన్నా ఇప్పుడు వరుస ఛాన్సులు అందుకుంటుంది.

లాస్ట్ ఇయర్ ఎఫ్-2, సైరా సినిమాలతో అమ్మడు సత్తా చాటగా లేటెస్ట్ గా యువ హీరో సత్య దేవ్ తో కన్నడ రీమేక్ లవ్ మ్యాక్ టైల్ లో నటిస్తుంది. ఈ సినిమాకు తెలుగులో గుర్తుందా శీతాకాలం అని టైటిల్ ఫిక్స్ చేశారు. ఇక ఇప్పుడు తమిళంలో విజయ్ సరసన ఛాన్స్ అందుకుంది. కెరియర్ డ్రాప్ అవుతున్న టైం లో మిల్కీ బ్యూటీ వరుస క్రేజీ ఆఫర్స్ తో అదరగొడుతుంది. అమ్మడు ఫాం చూస్తుంటే మరో ఐదారేళ్ళు ఇదే హవా కొనసాగించేలా ఉంది.