
మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నూతన దర్శకుడు సుబ్బు డైరక్షన్ లో కాంబోలో వస్తున్న సినిమా సోలో బ్రతుకే సో బెటర్. ఈ సినిమాను బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. మరో సింగిల్ షెడ్యూల్ తో షూటింగ్ పూర్తి చేసుకోబోతున్న ఈ సినిమా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. జీ తెలుగు ఆప్ జీ 5లో సాయి ధరం తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ సినిమా రిలీజ్ అవుతుందట.
ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ రెండు కలిపి ఫ్యాన్సీ ప్రైజ్ తో జీ 5 కొనేసిందని తెలుస్తుంది. ఇప్పటికే నాని వి అమేజాన్ ప్రైమ్ లో రిలీజ్ అవుతుండగా ఇదే బాటలో సినిమాలు ఓటిటి బాట పడుతున్నాయి. అయితే జీ 5లో రిలీజ్ అంటేనే సాయి ధరం తేజ్ రిస్క్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. అందులో డైరెక్ట్ సినిమాల రిలీజ్ లు తక్కువే. అమేజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లకు ఉన్నంత సబ్ స్క్రైబర్స్ అందులో లేరని టాక్. అంతేకాదు జీ 5 ఎక్కువ బాలీవుడ్ సినిమాలు, షోలు ప్రమోట్ చేస్తుంది. మరి సోలో బ్రతుకే సో బెటర్ సినిమాపై కాన్ ఫిడెంట్ గా ఉన్న సాయి ధరం తేజ్ ఓటిటి రిలీజ్ తో ఎలాంటి సత్తా చాటుతాడో చూడాలి.