
మెగా ఫ్యామిలీ హీరోల్లో తనకంటూ సెపరేట్ క్రేజ్ తెచ్చుకున్న హీరో పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ గా ఎదిగిన ఆయన ఒకానొక దశలో చిరు ఇమేజ్ ను కూడా క్రాస్ చేసినట్టుగా చెప్పుకుంటారు. పవర్ స్టార్ సినిమా రిలీజ్ అంటే ఆయన ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఇక ఈరోజు పుట్టినరోజు సందర్భంగా పవర్ స్టార్ నటిస్తున్న వకీల్ సాబ్ సినిమా నుండి మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు.
బాలీవుడ్ పింక్ రీమేక్ తో వస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లాయర్ గా నటిస్తున్నారు. వేణు శ్రీరాం డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరిదశకు వచ్చింది. ఇక పవన్ కళ్యాణ్ 27వ సినిమా క్రిష్ డైరక్షన్ లో వస్తుంది. ఈ సినిమా నుండి ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. పిరియాడికల్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో పవన్ లుక్ చాలా ప్రత్యేకంగా కనిపిస్తాడని తెలుస్తుంది.
ఇక పి.ఎస్.పి.కే 28వ సినిమా గబ్బర్ సింగ్ కాంబో రిపీట్ అవుతుంది. హరీష్ శంకర్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ పోలీస్ గా నటిస్తాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమా కేవలం ఎంటర్టైన్ మెంట్ మాత్రమే కాదు అంటూ హరీష్ ఇచ్చిన ట్యాగ్ లైన్ అదిరింది. ఫైనల్ గా బర్త్ డే రోజు రిలీజైన పవర్ స్టార్ సినిమా పోస్టర్స్ అన్ని పవర్ స్టార్ ఫ్యాన్స్ ఖుషి అయ్యేలా ఉన్నాయి.