
సూపర్ స్టార్ మహేష్ పరశురాం డైరక్షన్ లో సర్కారు వారి పాట సినిమా ఎనౌన్స్ చేశాడు. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ కలిసి నిర్మిస్తున్న్న ఈ సినిమాలో మహేష్ మాస్ లుక్ లో కనిపిస్తాడని తెలుస్తుంది. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తుండగా లేటేస్ట్ గా సినిమాకు సంబందిచిన మ్యూజిక్ సిట్టింగ్ స్టార్ట్ చేసినట్టు సమాచారం.
ఈ ఇయర్ మొదట్లో అల వైకుంఠపురములో సినిమాతో కెరియర్ బెస్ట్ ఆల్బం ఇచ్చిన థమన్ ఇప్పుడు సూపర్ ఫాం లో ఉన్నాడు. సర్కారు వారి పాట సినిమాకు కూడా ది బెస్ట్ ఆల్బం ఇచ్చేలా కృషి చేస్తున్నాడట. సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తుందని తెలుస్తుంది. 2021 లోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తారని టాక్.