మహేష్, పవన్ కాదన్నారా..?

నాచురల్ స్టార్ నాని వి డిజిటైల్ రిలీజ్ కు రెడీ అవుతుంది. సెప్టెంబర్ 5న రిలీజ్ అవుతున్న ఈ సినిమాను ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించగా సినిమాలో సుధీర్ బాబు కూడా నానికి ఈక్వల్ రోల్ ప్లే చేశారు. అయితే ఈ సినిమాను డైరక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి నాని, సుధీర్ ల కోసం కాదు మహేష్, పవన్ ల కోసం రాసుకున్నాడని తెలుస్తుంది. మహేష్ స్టోరీకి చెప్పగా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదట.. ఇక పవన్ కోసం ట్రై చేసినా కుదరకపోవడంతో నానితో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు.

ఈ సినిమాలో నాని ఫుల్ లెంగ్త్ నెగటివ్ రోల్ చేస్తున్నాడని తెలుస్తుంది. నివేదా థామస్, అదిరి రావు హైదరి ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఓటిటి రిలీజ్ అవుతున్నా సరే ఈ సినిమాపై ఆడియెన్స్ లో సూపర్ బజ్ ఉంది. ఇప్పటికే ప్రమోషన్స్ పీక్స్ లో చేస్తున్న ఈ సినిమా ట్రైలర్ తో సినిమాపై అంచనాలు డబుల్ చేశారు. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా రాబోతున్న వి నాని, సుధీర్ లకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.