
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డైరక్టర్ మార్తి ఇద్దరు మంచి ఫ్రెండ్స్. బన్నీ మల్టీమీడియా నేర్చుకునే టైంలోనే వీరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. అల్లు అర్జున్ హీరోగా.. మారుతి డైరక్టర్ మారిన తర్వాత కూడా ఆ ఫ్రెండ్ షిప్ అలానే కొనసాగుతుంది. ఏదో ఒకరోజు బన్నీని మెప్పించే కథను రాసి సినిమా చేస్తా అని మారుతి అప్పుడప్పుడు ఇంటర్వ్యూస్ లో చెబుతుంటాడు.
ఇక లేటెస్ట్ గా మారుతి ఆఫీస్ లో బన్నీ దర్శనమిచ్చాడు. స్టోరీ సిట్టింగ్ వేద్దాం రమ్మన్నాడో లేక బన్నీకి సరదాగా ఫ్రెండ్ ను కలవాలని అనిపించిందో కాని డైరక్టర్ మారుతి ఆఫీస్ లో అల్లు అర్జున్ సర్ ప్రైజ్ ఎంట్రీ ఫ్యాన్స్ ను అలరిస్తుంది. స్టైలిష్ తో మారుతి ఆఫీస్ లో బన్ని దిగిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. మొన్న గీతా ఆర్ట్స్ ఆఫీస్ కు వెళ్ళి అక్కడ హడావిడిని మిస్ అవుతున్నా అని పెట్టిన బన్నీ మారుతి ఆఫీస్ కు ఎందుకు వెళ్ళాడో తెలియాల్సి ఉంది.