
జబర్దస్త్ షోతో సూపర్ పాపులర్ అయిన సుడిగాలి సుధీర్ ఆ క్రేజ్ తో సినిమాల్లో కూడా ఛాన్సులు అందుకున్నాడు. మొన్నటిదాకా సైడ్ హీరోగా చేస్తూ వచ్చిన సుధీర్ సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమాతో హీరోగా మారాడు. రాజశేఖర్ రెడ్డి పులిచర్ల డైరెక్ట్ చేసిన ఆ సినిమాతో తన టాలెంట్ అంతా చూపించినా సినిమా మాత్రం కమర్షియల్ గా వర్క్ అవుట్ అవలేదు. ఆ తర్వాత మరో రెండు సినిమాలు చేశాడు సుధీర్. ఇక లేటెస్ట్ గా సుధీర్ హీరోగా కొత్త సినిమా మొదలైంది.
సాఫ్ట్ వేర్ సుధీర్ డైరక్టర్ రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారని తెలుస్తుంది. ఈరోజు పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా త్వరలో రెగ్యులర్ షూట్ కు వెళ్ళనుంది. ఈ సినిమాను సామ శివ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ లో అంజన్ బాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబందించిన మరిన్ని డీటైల్స్ త్వరలో తెలియనున్నాయి.