రాజు గారి చేపల పులుసు.. వీడియో వైరల్..!

సీనియర్ హీరో కృష్ణం రాజు భోజన ప్రియుడని తెలిసిందే. ఆయన ఎలాంటి వంటకమైనా సరే వాసన చూసి ఎలా ఉందో చెప్పగలరు. కృష్ణం రాజు గారి గురించి ఇలాంటి వినడమే తప్ప ఎప్పుడు చూడలేదు. అయితే లేటెస్ట్ గా రాజు గారు చేపల పులుసు వాసన చూసి సాల్ట్ సరిపోయిందా లేదా అన్నది చెప్పేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.    

కృష్ణం రాజు కూతురు ప్రసీధ తన ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియో అప్లోడ్ చేశారు. వీకెండ్ స్పెషల్ డాడీ చేపల పులుసు. ప్రపంచంలో ఇదే బెస్ట్.. వాసన చూసి సాల్ట్ సరిపోయిందో లేదో చెప్పేస్తారు అంటూ చెప్పేశాడు. ప్రస్తుతం రాజు గారి చేపల పులుసు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.