నాగ చైతన్య.. విక్రం కుమార్.. 'థ్యాంక్ యు'

కింగ్ నాగార్జున బర్త్ డే సందర్భంగా నాగ చైతన్య, విక్రం కుమార్ కాంబోలో వస్తున్న సినిమా టైటిల్ ఎనౌన్స్ చేశారు నిర్మాత దిల్ రాజు. ఈ సినిమాకు థ్యాంక్ యు అని టైటిల్ ఫిక్స్ చేశారు. మనం కాంబోలో వస్తున్న ఈ సినిమాకు ఈ టైటిల్ ఏంటని ఆడియెన్స్ షాక్ అవుతున్నారు. థ్రిల్లర్ సినిమాగా థ్యాంక్ యు వస్తుందని ఫిల్మ్ నగర్ టాక్. ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరక్షన్ లో లవ్ స్టోరీ సినిమా చేస్తున్న నాగ చైతన్య ఆ సినిమాను పూర్తి చేసి థ్యాంక్ యు సినిమాకు సిద్ధం కానున్నాడు.  

లాస్ట్ ఇయర్ నాని గ్యాంగ్ లీడర్ అంచాలను అందుకోకపోవడంతో ఈసారి మరింత కసితో స్క్రిప్ట్ రాసుకున్నాడట డైరక్టర్ విక్రం కుమార్. చైతుతో ఆల్రెడీ హిట్టు కొట్టాడు కాబట్టి ఈ కాంబోపై అంచనాలు భారీగా ఉన్నాయి. నాగ్ బర్త్ డే రోజు నాకు రాజుగా ఉన్నందుకు అని నాగ చైతన్య.. నాకు మనం ఇచ్చినందుకు విక్రం కుమార్.. నిర్మాతగా మా జర్నీలో 20 ఏళ్ళుగా తోడుగా ఉన్నందుకు దిల్ రాజు అందరు కలిసి కింగ్ నాగార్జునకు బర్త్ డే విష్ తో పాటుగా థ్యాంక్ యు అని చెప్పి సినిమా టైటిల్ ఇదే అని ప్రకటించారు.