
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ డైరక్షన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా ఆచార్య. మ్యాట్నీ ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా నుండి ఈమధ్య వచ్చిన టైటిల్ పోస్టర్ ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. చిరుతో పాటుగా రాం చరణ్ కూడా ఈ సినిమాలో నటిస్తాడని తెలిసి సినిమాపై మరింత క్రేజ్ ఏర్పడింది.
సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. కరోనా లాక్ డౌన్ వల్ల ఆరు నెలలు షూటింగ్ కు బ్రేక్ ఇచ్చిన ఈ సినిమా డిసెంబర్ నుండి సెట్స్ మీదకు వెళ్ళే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమా 2021 సమ్మర్ రిలీజ్ అని ఎనౌన్స్ చేయగా.. తెలుస్తున్న సమాచారం ప్రకారం 2021 ఏప్రిల్ 9 డేట్ లాక్ చేశారని తెలుస్తుంది. టాలీవుడ్ లో సెంటిమెంట్స్ చాలా ఉంటాయి. సమ్మర్ రేసులో ఏప్రిల్ 9న రిలీజైన సినిమాలన్ని సక్సెస్ అవడంతో ఆ డేట్ నే లాక్ చేశారట ఆచార్య టీం. అనుకున్న టైం కు ఆచార్య వస్తుందా లేదా అన్నది చూడాలి.