యువ హీరో తెగ కష్టపడుతున్నాడు..!

యువ హీరోల్లో తనకంటూ ఓ మార్క్ వేసుకునేందుకు ప్రయత్నిస్తున్న వారిలో నాగ శౌర్య ఒకరు. ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి హీరోగానే కాదు సినిమాలో ఇంపార్టెంట్ రోల్ అది చిన్నదైనా సరే ఓకే చేసేద్దాం అనుకునే మైండ్ సెట్ తో ఉంటాడు నాగ శౌర్య. లాస్ట్ ఇయర్ వచ్చిన ఓ బేబీలో హీరో పాత్ర కాకపోయినా సరే నాగ శౌర్య కాబట్టే ఆ పాత్రలో నటించాడని చెప్పొచ్చు. ఛలోతో సూపర్ హిట్ అందుకున్న ఈ యువ హీరో ఈమధ్య కెరియర్ లో వెనుకపడ్డాడు. అందుకే ప్రస్తతం చేస్తున్న 20వ సినిమాకు తెగ కష్టపడుతున్నాడు.

నాగ శౌర్య 20వ సినిమా సంతోష్ జాగర్లముడి డైరక్షన్ లో వస్తుంది. ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ లో నాగ శౌర్య సిక్స్ ప్యాక్ లుక్ అదిరిపోయింది. సిక్స్ ప్యాక్ బాడీతో విల్లు ఎక్కు పెట్టిన నాగ శౌర్యని చూసి కటౌట్ అదిరిందని అన్నారు. మాస్ ఇమేజ్ కోసమే చేస్తున్న ప్రయత్నంలో భాగంగా నాగ శౌర్య ఈ ఇయర్ మొదట్లో అశ్వద్ధామ అంటూ వచ్చి నిరాశపరచాడు. అయితే మరోసారి మాస్ అటెంప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. నాగ శౌర్య 20వ సినిమాకు పార్ధు టైటిల్ పరిశీలనలో ఉంది. ఇక ఈ హీరో ఈ సినిమాలో లుక్ కోసం జిమ్ వర్క్ అవుట్స్ బాగా చేస్తున్నాడు. ప్రస్తుతం ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.