విక్రమ్ కూడా అందుకు రెడీ..!

థియేటర్లు మూతపడటం డిజిటల్ ఫ్లాట్ ఫామ్ కు బాగా కలిసి వచ్చింది. ఓటిటిలో సినిమాలతో పాటుగా వెబ్ సీరీస్ లకు మంచి క్రేజ్ ఏర్పడింది. కెరియర్ లో వెనకపడ్డ వారే కాదు స్టార్స్ కూడా ఇప్పుడు వెబ్ సీరీస్ లకు ఓకే అంటున్నారు. ఈ క్రమంలో కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ కూడా వెబ్ సీరీస్ కు రెడీ అవుతున్నాడట. ఓ పక్క వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నా సరే కొత్త దర్శకుడు చెప్పిన వెబ్ సీరీస్ స్టోరీ నచ్చి అతనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.  

అంతేకాదు స్టోరీ తనని చాలా ఎక్సయిటింగ్ కు గురి చేసిందని అందుకే వెబ్ సీరీస్ కు ఓకే చెప్పానని తన సన్నిహితులతో చెబుతున్నాడట విక్రమ్. ప్రస్తుతం చియాన్ విక్రమ్ కోబ్రా మూవీ చేస్తున్నారు. ఈ సినిమా పూర్తి కాగానే 60వ సినిమా కార్తిక్ సుబ్బరాజ్ డైరక్షన్ లో చేయనున్నాడు. ఈ సినిమాలో విక్రమ్ తనయుడు ధృవ్ కూడా నటిస్తుండటం విశేషం. విక్రమ్ 60వ సినిమా తండ్రి కొడుకుల మల్టీస్టారర్ సినిమాగా రానుంది. ఈలోగా వెబ్ సీరీస్ లతో కూడా అదరగొట్టేందుకు రెడీ అయ్యాడు విక్రమ్.