
ఏయన్నార్ నట వారసత్వాన్ని కొనసాగించిన యువ సామ్రాట్ నాగార్జున అక్కినేని హీరోగా తిరిగులేని స్టార్ ఇమేజ్ సంపాదించాడు. తండ్రికి తగ్గ తనయుడిగా అనిపించుకుంటూ ఏయన్నార్ లానే కెరియర్ స్టార్టింగ్ లోనే స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నారు. విక్రం సినిమాతో హీరోగా పరిచయమైన నాగార్జున శివతో సెన్సేషనల్ హిట్ సాధించారు. ఇక కెరియర్ లో హిట్లు ఫ్లాపులను ఈక్వల్ చేసుకుంటూ టాలీవుడ్ లో తిరుగులేని స్టార్ మేజ్ సంపాదించారు. ఎప్పుడు ప్రయోగాలకు పెద్ద పీట వేసే నాగార్జున ఒక్కోసారి ఫలితాలు తేడా కొట్టినా సరే వెనుకడుగు వేయలేదు.
రొమాంటిక్ సినిమాలే కాదు.. డివోషనల్ మూవీస్ చేసి తన సత్తా చాటారు. మాస్ ను మెప్పిస్తూ క్లాస్ ను కవర్ చేస్తూ నాగార్జున అశేష ప్రేక్షక అభిమానానాన్ని పొందారు. ఈరోజు 60వ వసంతంలోకి అడుగుపెడుతున్న కింగ్ నాగార్జునకు పుట్టినరోజు శుభాకాంక్షలు.