
ప్రేమం బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ బాగా హర్ట్ అయ్యింది. తన తప్పు లేకుండా తనని టార్గెట్ చేసినందుకు ఆమె మాతృ భాష మళయాళంలో సినిమాలు చేయకూడదని ఫిక్స్ అయ్యింది. మళయాళ ప్రేమం సినిమాలో నటించి క్రేజ్ తెచ్చుకున్న అనుపమ ఆ తర్వాత అక్కడ మరో రెండు సినిమాలు చేసింది. మనియారయిలే అశోకన్ అనే మళయాళ సినిమాకు అసిస్టెంట్ డైరక్టర్ గా కూడా వర్క్ చేసింది అనుపమ.
అయితే తను మళయాళంలో చేస్తున్న సినిమాల టైంలో తనకు పొగరు ఎక్కువని.. దానితో బిల్డప్ కొడుతున్నానని మళయాళ మీడియాలో వార్తలు వచ్చాయి. అవి తను చేసిన సినిమా మేకర్స్ దగ్గర నుండి ఇన్ పుట్స్ తోనే ఆ వార్తలు వచ్చాయని తెలిసి ఇకమీదట మళయాళంలో సినిమాలు చేయ్కూడదని అనుకుంటున్నా అని అంటుంది అమ్మడు. హీరోయిన్ అన్నాక ఇలాంటి లైట్ తీసుకోవాలి కాని ఇలా భీష్మించుకు కూర్చుంటే అవకాశాలు రాకుండాపోతాయన్న విషయం అనుపమ అర్ధం చేసుకోవట్లేదు. తెలుగు, తమిళ భాషల్లో మాత్రం అనుపమ సినిమాలు చేస్తుంది. తెలుగులో లాస్ట్ ఇయర్ రాక్షసుడు సినిమా చేసిన అనుపమ తర్వాత నిఖిల్ 18 పేజెస్ లో నటిస్తుందని అన్నారు కాని ఆమె ప్లేస్ లో నాని గ్యాంగ్ లీడర్ బ్యూటీ ప్రియాంకా అరుల్ మోహన్ నటిస్తుందని తెలుస్తుంది.