
ఎఫ్-2, గద్దలకొండ గణేష్ రెండు బ్యాక్ టూ బ్యాక్ హిట్లతో సూపర్ ఫాం లో ఉన్న మెగా హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం బాక్సర్ అంటూ వస్తున్నాడు. కిరణ్ కొర్రపాటి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం రెండు షెడ్యూళ్ళను పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ గా తన సత్తా చూపిస్తారట. ఇక ఈ సినిమా తర్వాత వరుణ్ తేజ్ యువ దర్శకుడు సాగర్ చంద్రకు ఓకే చెప్పాడని టాక్.
అయ్యారే, అప్పట్లో ఒకడుండేవాడు సినిమాలతో ప్రతిభ చాటిన దర్శకుడు సాగర్ చంద్ర వరుణ్ తేజ్ కోసం ఓ పోలీస్ కథ రాసుకున్నాడట. స్టోరీ నచ్చడంతో వరుణ్ తేజ్ కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. వరుణ్ తేజ్ కెరియర్ లో ఫస్ట్ టైం పోలీస్ గా కనిపించనున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా గురించి మిగతా డీటైల్స్ త్వరలో తెలుస్తాయి.