
మెగా పవర్ స్టార్ రాం చరణ్ ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్నాడు. రాజమౌళి డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రాం చరణ్ నటిస్తున్నారు. కొమరం భీమ్ పాత్రలో ఎన్.టి.ఆర్ సర్ ప్రైజ్ చేయనున్నారు. ట్రిపుల్ ఆర్ తర్వాత తారక్ ఆల్రెడీ ప్రశాంత్ నీల్, త్రివిక్రం ఇద్దరు దర్శకులను లైన్ లో పెడితే రాం చరణ్ మాత్రం ఆచార్యలో స్పెషల్ రోల్ ఒక్కటే చేస్తున్నాడు తప్ప తన నెక్స్ట్ సినిమా ఏంటన్నది నిర్ణయించుకోలేదు.
లేటెస్ట్ గా ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం చూస్తే అర్జున్ రెడ్డి డైరక్టర్ తో రాం చరణ్ స్టోరీ డిస్కస్ చేస్తున్నారట. దాదాపు ఈ కాంబోలో సినిమా ఫిక్స్ అయ్యే ఛాన్సులు ఉన్నట్టు తెలుస్తుంది. తెలుగులో అర్జున్ రెడ్డితో అదిరిపోయే హిట్టు కొట్టి అదే సినిమాతో బాలీవుడ్ లో కూడా కబీర్ సింగ్ గా రీమేక్ చేసి అక్కడ సెన్సేషనల్ హిట్ అందుకున్న సందీప్ వంగ నెక్స్ట్ సినిమా రణబీర్ కపూర్ తో ప్లాన్ చేయగా వర్క్ అవుట్ కాలేదు. అందుకే మళ్ళీ టాలీవుడ్ కు వచ్చి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. రాం చరణ్ తో సందీప్ వంగ సినిమా పాన్ ఇండియా రేంజ్ లోనే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.