ఆరోజు నుండి బిగ్ బాస్ 4

బుల్లితెర ఆడియెన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 4 మొదలయ్యే రోజు ఎనౌన్స్ చేసింది స్టార్ మా. బిగ్ బాస్ సీజన్ 4 సెప్టెంబర్ 6న మొదలవుతుందని తెలుస్తుంది. కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ సీజన్ కూడా 15 మంది కంటెస్టంట్స్ 105 రోజుల పాటు ఉంటుందని తెలుస్తుంది. ఇక ఈ సీజన్ లో స్టార్ సెలబ్రిటీస్ కంటెస్టంట్స్ గా వస్తున్నారని తెలుస్తుంది. 

ఆగష్టు 30 నుండి షో మొదలవుతుందని వార్తలు వస్తుండగా లేటెస్ట్ గా బిగ్ బాస్ ప్రోమోతో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నది రివీల్ చేశారు. ఇదివరకు 3 సీజన్ల కన్నా ఈ సీజన్ చాలా క్రేజీగా ఉండబోతుందని అంటున్నారు. టాస్కులు కూడా కొత్తగా ఉంటాయని టాక్. కరోనా టైంలో హౌజ్ లోకి వెళ్ళే కంటెస్టంట్స్ అందరికి కోవిడ్ టెస్ట్ చేసి నెగటివ్ వచ్చిన తర్వాతనే వారిని బిగ్ బాస్ నిర్వాహకులు ఏర్పరచిన క్వారెంటైన్ లో ఉంచినట్టు తెలుస్తుంది. అంతేకాదు ఈ సీజన్ లో హోస్ట్ నాగార్జున కూడా హౌజ్ లోకి వెళ్ళరట. ప్రతి సీజన్ లో ఎవరో ఒక స్టార్ సెలబ్రిటీ హౌజ్ లోకి వస్తారు. కాని ఈ సీజన్ అది కూడా ఉండని అంటున్నారు. కంటెస్టంట్స్ ఇంటి సభ్యులకు ఈసారి బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ లేదని తెలుస్తుంది.