
రాజమౌళి డైరక్షన్ లో వస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాలో ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి నటిస్తున్నారు. ఒక స్టార్ తోనే సెన్సేషనల్ హిట్ కొట్టే రాజమౌళి తారక్, చరణ్ లతో కలిసి ఆర్.ఆర్.ఆర్ అంటూ అదరగొట్టబోతున్నాడు. లేటెస్ట్ మరో క్రేజీ మల్టీస్టారర్ డిస్కషన్స్ లో ఉన్నట్టు తెలుస్తుంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇద్దరు కలిసి ఓ మల్టీస్టారర్ చేస్తారని ఫిల్మ్ నగర్ టాక్.
ఈ కాంబినేషన్ ను బడా నిర్మాత దిల్ రాజు సెట్ చేస్తున్నారట. ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్ తో పాటుగా నాగ్ అశ్విన్, ఓం రౌత్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. బన్నీ కూడా పుష్ప షూటింగ్ కు సిద్ధమవుతున్నాడు. ఈ ఇద్ద్దరు వారి కమిటెడ్ సినిమాలను పూర్తి చేశాక ఈ సినిమా గురించి ఆలోచిస్తారని తెలుస్తుంది. ప్రభాస్, అల్లు అర్జున్ కలిసి నటిస్తే ఆ సినిమా హంగామా మాత్రం ఓ రేంజ్ లో ఉంటుందని చెప్పొచ్చు.