ఆహా కోసం అను ఇమ్మాన్యుయేల్

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కొత్తగా ప్రారంభించిన ఆహా ఓటిటిని సక్సెస్ ఫుల్ బాటలో తీసుకెళ్తున్నారు. ఇప్పటికే వెబ్ సీరీస్, వెబ్ మూవీస్ లతో పాటుగా చిన్న సినిమాలను డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేస్తుండగా లేటెస్ట్ గా స్టార్స్ సెలబ్రిటీస్ తో కూడా ఆహాలో వెబ్ సీరీస్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆహా కోసం ఇప్పటికే ఒకరిద్దరు హీరోయిన్స్ ఓకే అనగా లేటెస్ట్ గా మెగా హీరోయిన్ అను ఇమ్మాన్యుయెల్ కూదా ఆహాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తుంది.

పవన్ కళ్యాణ్ తో అజ్ఞాతవాసి, అల్లు అర్జున్ తో నా పేరు సూర్య సినిమాల్లో నటించిన అను ఇమ్మాన్యుయెల్ ఆ రెండు సినిమాలు ఫ్లాప్ అవడంతో ఆమెకు ఛాన్సులు లేకుండా పోయాయి. నాగ చైతన్యతో చేసిన శైలజా రెడ్డి అల్లుడు సినిమా కూడా నిరాశపరచడంతో అను ఇమ్మాన్యుయెల్ కెరియర్ లో వెనకపడ్డది. ఇక లేటెస్ట్ గా ఆహా కోసం ఆమెను దించుతున్నారట. అను ఇమ్మాన్యుయెల్ వెబ్ సీరీస్ కోసం ఎపిసోడ్ కు 2 లక్షల దాకా డిమాండ్ చేస్తుందట. మరి అమ్మడు వెబ్ సీరీస్ తో అయినా అదరగొడుతుందేమో చూడాలి.