
క్రియేటివ్ డైరక్టర్ సుకుమార్ రంగస్థలం తర్వాత కొద్దిపాటి గ్యాప్ తో అల్లు అర్జున్ తో పుష్ప సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాతో పాటుగా సుకుమార్ తన నిర్మాణంలో 18 పేజెస్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు నిర్మతగానే కాకుండా రైటర్ గా కూడా పనిచేస్తున్నాడు.
ఇదే కాదు సుకుమార్ మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ సినిమాకు పనిచేస్తున్నాడట. సాయి ధరం తేజ్ సినిమాకు సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తున్నాడట. సుకుమార్ అసిస్టెంట్ కార్తిక్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాకు సుకుమార్ కూడా స్క్రీన్ ప్లే అందిస్తున్నాడట. సో ఒకేసారి ఇద్దరు మెగా హీరోల సినిమాలకు సుకుమార్ పనిచేస్తున్నాడని చెప్పొచ్చు.