
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ చూసి ఈ కథ తను రాసుకున్న సినిమా కథతో వస్తుందని రైటర్ రాజేష్ మీడియాలో హంగామా చేశాడు. కొరటాల శివ తన కథను కాపీ కొట్టి ఆచార్య సినిమా చేస్తున్నాడని రైటర్ రాజేష్ అన్నారు. అయితే దీనిపై ఆచార్య నిర్మాణ సంస్థ వివరణ ఇచ్చింది.
ఆచార్య సినిమా కథ కొరటాల శివ సొంతంగా రాసుకున్నదే.. కేవలం పోస్టర్ చూసి కథ ఇదే అని అంచనా వేసుకుని కొందరు అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారని.. కొరటాల శివ స్వతహాగా రాసుకున్న కథతోనే ఆచార్య తెరకెక్కుతుందని అన్నారు. ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేయడం సబబు కాదని నిర్మాణ సంస్థ ప్రకటించింది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నా ఆచార్య సినిమా కొణిదెల ప్రొడక్షన్ సంపర్పణలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారని తెలుస్తుంది.