
మాస్ మహరాజ్ రవితేజ హీరోగా గోపిచంద్ మలినేని డైరక్షన్ లో క్రేజీ మూవీగా వస్తున్న క్రాక్ ఓటిటి రిలీజ్ కాబోతుందని తెలుస్తుంది. రవితేజ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయో చెప్పలేని పరిస్థితి కనబడుతుంది. అందుకే రవితేజ క్రాక్ సినిమాను ఓటిటి రిలీజ్ చేయాలని చూస్తున్నారట.
డైరక్టర్ గోపిచంద్ మలినేని మాత్రం ఈమధ్య తన ట్విట్టర్ లో క్రాక్ ఓన్లీ ఆన్ థియేటర్స్ అని ట్వీట్ చేశాడు. రవితేజ మాత్రం ఓటిటి రిలీజ్ చేసినా తనకెలాంటి అభ్యంతరం లేదని చెప్పాడట. మరి రవితేజ క్రాక్ ఓటిటి రిలీజ్ అవుతుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఓ పక్క నాని వి డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ అవుతుంది. అంతేకాదు కోలీవుడ్ లో సూర్య ఆకాశం నీ హద్దురా సినిమాని కూడా ఓటిటి రిలీజ్ చేస్తున్నారు. వారి బాటలోనే రవితేజ కూడా క్రాక్ సినిమాను డిజిటల్ రిలీజ్ కు సై అంటున్నాడు.