
బాలీవుడ్ లో హిట్టైన అందాదున్ సినిమాను తెలుగులో నితిన్ రీమేక్ చేస్తున్నారని తెలిసిందే. మేర్లపాక గాంధి డైరెక్ట్ చేస్తున్న ఈ రీమేక్ లో ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతుంది. నితిన్ సరసన ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. అందాదున్ లో టబు పాత్ర హైలెట్ గా నిలిచింది. తెలుగులో ఆమె పాత్రలో ఎవరు నటిస్తారన్న దాని మీద క్లారిటీ రాలేదు.
టబునే ఇక్కడ కూడా నటింపచేయాలని అనుకున్నా ఆమె భారీ రెమ్యునరేషన్ అడగడంతో సైలెంట్ అయ్యారు. నయనతారని కూడా ఆ పాత్ర కోసం అడిగారట కాని ఆమె కూడా పారితోషికం విషయంలో భారీ షాక్ ఇచ్చిందట. అందుకే సీనియర్ హీరోయిన్ శ్రీయ శరణ్ ను టబు పాత్రకు ఫైనల్ చేశారట చిత్రయూనిట్. పెళ్ళి తర్వాత కూడా వరుస సినిమాలతో సత్తా చాటుతుంది శ్రీయా శరణ్. అందాదున్ తెలుగులో రీమేక్ లో బోల్డ్ పాత్రలో నటించడానికి సై అనేసిందట శ్రీయ. మరి అమ్మడికి ఈ సినిమా ఎలాంటి క్రేజ్ తెస్తుందో చూడాలి.