గీతా గోవిందం మరోసారి జంటగా..!

గీతా గోవిందం సినిమాతో క్రేజీ జంటగా మారిన విజయ్ దేవరకొండ, రష్మిక మళ్ళీ కలిసి నటించనున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరీ జగనాథ్ డైరక్షన్ లో ఫైటర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ నిన్నుకోరి ఫేమ్ శివ నిర్వాణ డైరక్షన్ లో సినిమా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ డైరక్టర్ నానితో టక్ జగదీష్ చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తి కాగానే విజయ్ దేవరకొండ మూవీ స్టార్ట్ చేస్తారట.     

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన కన్నడ భామ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుందని అంటున్నారు. గీతాగోవిందం, డియర్ కామ్రేడ్ ఈ రెండు సినిమాలతో విజయ్, రష్మిక జంట సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పుడు ముచ్చటగా మూడవసారి ఈ ఇద్దరు కలిసి నటిస్తున్నారని తెలుస్తుంది. అదే జరిగితే హ్యాట్రిక్ మూవీ మరింత క్రేజీగా మారుతుందని చెప్పొచ్చు. నిన్నుకోరి, మజిలీ రెండు బ్యాక్ టూ బ్యాక్ హిట్లు అందుకున్న శివ నిర్వాణ విజయ్ కోసం మరో డిఫరెంట్ లవ్ స్టోరీ రాసినట్టు తెలుస్తుంది.